పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన నాయకులు, జనసైనికులు దాడి చేసారని సమాచారం అందుతోంది. గొల్లప్రోలు మండలం, వన్నెపూడి గ్రామంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై జనసేన నాయకులు, జనసైనికులు దాడి చేసారని సమాచారం అందుతోంది. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు… పూర్తిగా ధ్వసంమైంది. వర్మ త్యాగానికి ప్రతిఫలం గా జనసేన నాయకులు దాడి చేయించారంటున్నారు పలువురు. వర్మకు ఇక అంతా కర్మే అంటున్నారు పలువురు నేతలు.
ఇక దీనిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. దాడి నుండి అదృష్టవశాత్తూ బయట పడ్డాను. కర్రలు,ఇటుక రాళ్ళు, కూల్ డ్రింక్స్ తో నాపై దాడి చేశారన్నారు. వీరిని కాకినాడ జనసేన ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నాడని వెల్లడించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత ఎనిమిది నెలలుగా వీరితో గొడవలు పడుతున్నాం. వీరంతా అధికారం కోసం టీడీపీ నుండి వెళ్ళిన జనసేన నాయకులు. నాపై దాడి చేసిన వ్యక్తులు పోలీసుల దృష్డిలో ఉన్నారని చెప్పారు. ఎన్నికల్లో మాకు పని చేసిన వ్యక్తులకు కృతజ్ఞతలు చెప్పేందుకు వన్నెపూడి వెళ్ళాను అన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.