Former YCP MP Nandigam Suresh’s brother arrested: బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు ఊహించిన షాక్ తగిలింది. బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్టు అయ్యారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు ప్రభుదాసును పోలీసులు అరెస్టు చేశారు.
ఆదివారం రాత్రి ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను తుళ్లూరు పోలీసులు పట్టుకున్నారు. వాటిని ప్రభుదాసువిగా గుర్తించి ఆయనను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. రెండు లారీలు, కారు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత… ఇలా ఏదో ఒక కేసులో వైసీపీ నాయకులకు ఇబ్బందులు పెడుతోంది టీడీపీ పార్టీ. ఇందులో భాగంగానే…ఇప్పుడు బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడిని అరెస్ట్ చేశారని సమాచారం.