అమరావతిలో రేపు బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరుగనుంది. రేపు ఉదయం తొమ్మిదిన్నరకు శంకుస్థాపన చేయనున్నారు నందమూరి బాలకృష్ణ, కుటుంబ సభ్యులు. ఇక బసవతారకం ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపనకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

తుళ్లూరు- అనంతవరం గ్రామాల మధ్య బసవతారకం ఆసుపత్రి కోసం 21 ఎకరాలు కేటాయించింది CRDA. ఇక అటు ఆశా వర్కర్లకు వరాలు ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆశా వర్కర్లకు వరాలు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇవ్వనున్నారు. ఆశా వర్కర్ గా పనిచేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలు ఫిక్స్ చేశారు.