Chandrababu: ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభంలో ట్విస్ట్ నెలకొంది. దీపావళి రోజున కాకుండా.. నవంబర్ 1వ తేదీన ఉచిత సిలిండర్ల పథకం ప్రారంభం కానుందట. దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకం చేయనుంది. ఈ మేరకు దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మొదటి విడతకు అయ్యే ఖర్చు 894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందజేశారు సిఎం చంద్రబాబు.
నిన్నటి నుంచి అమల్లోకి దీపం -2 పథకం వచ్చింది. 1వ తేదీన శ్రీకాకుళంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.