ఇస్రో సంస్థ మరో విజయాన్ని దక్కించుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన గగన్ యాన్ మిషన్ TV-D1 ప్రయోగం విజయవంతం అయింది. నిర్దేశిత దూరం 17 కిలో మీటర్ల మేర ఆకాశంలోకి వెళ్లి భూ వాతావరణంలోకి చేరింది క్రూ మాడ్యూల్. ప్యారా చూట్ల సహకారంతో దశల వారీగా బంగాళాఖాతంలోకి జలాల్లోకి వెళ్లనుంది గగన్ యాన్.
నావికా దళ సహకారంతో క్రూ మాడ్యూల్ ను రికవరీ చేశారు శాస్త్రవేత్తలు.. సవాల్ గా తీసుకొని గంటల వ్యవధిలోనే సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన శాస్త్రవేత్తలు… గగన్ యాన్ మిషన్ TV-D1 ప్రయోగం విజయవంతం చేసుకున్నారు.
రాకెట్ శిఖర భాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ ఎస్కేప్ సిస్టంను భూమికి 17 కిలోమీటర్ల మేర పైకి పంపింది రాకెట్. అనంతరం పారాచూట్స్ సాయంతో బంగాళాఖాతంలోకి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగనుంది. కాగా, ప్రపంచంలోనే జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న దిగి హిస్టరీ క్రియేట్ చేసింది.