అసాంఘిక శక్తులు అనే పదానికి రీ డిఫైన్ చేయాలన్నారు సీఎం జగన్. ప్రశాంతంగా సాగుతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్థం కోసం దెబ్బ తీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులేనని.. ప్రభుత్వం, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలని అనుకునే శక్తులు అన్నీ కూడా అడవుల్లో, అజ్ఞాతంలో లేవని చెప్పారు. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా జీవితం మీద దాడి చేయటం ఈ మధ్య చూస్తున్నామని వివరించారు సీఎం జగన్.
విజయవాడలో జరిగిన పోలీస్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ప్రతి పోలీసుకు ఇన్యూరెన్స్ కింద రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల బీమా కవరేజీ ఇచ్చేందుకు ఎస్బీఐ ముందకొచ్చిందని వెల్లడించారు సీఎం జగన్. ఈ మేరకు ఆ బ్యాంకుతో నెగోషియేషన్ పూర్తియిందని ప్రకటన చేశారు. విధి నిర్వహణలో ప్రాణం వదిలిన పోలీస్ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని.. పోలీస్ ఉద్యోగం ఒక సవాల్ అన్నారు సీఎం జగన్. ప్రస్తుత రోజుల్లో నేరం తన రూపాన్ని మార్చుకుంటోందని.. కొత్త టెక్నాలజీ వల్ల సైబర్ సెక్యూరిటీ నుంచి డేటా చోరీ వరకు నేరాలు జరుగుతున్నాయని చెప్పారు.