ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యంగా వైసిపి పార్టీ నేతలు టార్గెట్ చేసి… టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. ఛాన్స్ ఉంటే జైల్లో కూడా పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే నగరి మాజీ ఎమ్మెల్యే రోజాను ఉద్దేశించి ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు నగరి మాజీ ఎమ్మెల్యే రోజా… కోట్లలో డబ్బులు సంపాదించిందని ఆరోపణలు చేశారు. 2000 రూపాయలకు ఏ పని అయినా చేసేదని.. బాంబు పేల్చారు టిడిపి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్. ఇప్పుడు కోట్లల్లో డబ్బులు సంపాదించింది అని కూడా ఫైర్ అయ్యారు. అయితే నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి రోజాపై @JaiTDP ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆర్కే రోజా ఫిర్యాదు#AndhraPradesh #Nagari #TDP #YSRCP pic.twitter.com/qDeyQMaFma
— Telugu Feed (@Telugufeedsite) July 17, 2025