ఏపీలోని 5 మున్సిపల్ కార్పొరేషన్లకు కేంద్రం అవార్డులు దక్కాయి . ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన మంత్రి నారాయణ. . . అనంతరం మాట్లాడారు. రాష్ట్రం నుంచి 5 మున్సిపల్ కార్పొరేషన్లు అవార్డులకు ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. విజయవాడ, తిరుపతి, గుంటూరు, జీవీఎంసీ, రాజమండ్రి కార్పొరేషన్లకు అవార్డులు దక్కినట్లు చెప్పారు.

స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందిస్తున్నానని చెప్పారు. చంద్రబాబు స్వచ్ఛ భారత పై ప్రత్యేక ప్రత్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. ప్రతినెల మూడో శనివారం ఒక నియోజక వర్గానికి వెళ్లి స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్చిస్తున్నారు… ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు మంత్రి నారాయణ. భవిష్యత్ లో మరిన్ని అవార్డులు సాధిస్తామని వెల్లడించారు.