హైదరాబాద్‌ను డెవలప్ చేసింది నేనే అవునా.. కాదా.. తమ్ముళ్లు అంటూ CM చంద్రబాబు నాయుడు హాట్ కామెంట్స్ చేశారు. హంద్రీ-నీవాకు నీటిని విడుదల చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద మోటార్ ఆన్ చేసి సీమ జిల్లాలకు కృష్ణాజలాలను విడుదల చేసిన చంద్రబాబు… అనంతరం మాట్లాడారు.

బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కానని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో నీటి సమస్యలపై కీలక చర్చలు జరిగాయి… నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబిస్తామన్నారు. ప్రధాని కూడా నదుల అనుసంధానం చేయాలని భావిస్తున్నారని తెలిపారు సీఎం చంద్రబాబు.
హైదరాబాద్‌ను డెవలప్ చేసింది నేనే అవునా.. కాదా.. తమ్ముళ్లు.. – CM చంద్రబాబు#AndhraPradesh #CMChandrababu pic.twitter.com/A95cme5IRj
— Telugu Feed (@Telugufeedsite) July 17, 2025