నేను పిచ్చి కుక్క అయితే..నువ్వు గంజాయి మొక్క – విజయసాయికి బండ్ల గణేష్ కౌంటర్

-

బండ్ల గణేష్, విజయసాయి రెడ్డిల మధ్య ట్వీట్ల వార్ తగ్గడం లేదు. అవును నేను కుక్కనే.. దొంగ సాయి అంటూ తాజాగా మరో ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ఎస్ నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం కష్టపడ్డాం నీలా దోచుకోలేదు దొంగ సొమ్ము దాచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి అంటూ ఓ రేంజ్ ల్ రెచ్చిపోయారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తోందని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలసిన గంజాయి మొక్క మీరు..ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యమన్నారు బండ్ల గణేష్.

“యస్ నేను కుక్క నే గర్వం గా చెప్పుకుంటా నాకు అన్నం పెట్టి బతుకుని ఇచ్చిన విశ్వాసం గల కుక్కని నీ లాగ పిచ్చి కుక్కని గజ్జి కుక్కని మోసపు కుక్క ని కాదు దొంగ సాయి గారు మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ.. అరెస్ట్ చేయిస్తారో కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నేన్ని చేస్తారో. అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు.” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version