సీఎం జగన్ జైలుకు వెళ్లడు.. ఆయన వెంట్రుక కూడా పీకలేరన్నారు గోనె ప్రకాష్. కంపెనీలు పెట్టుబడులకు సంబంధించి ఫైన్లు పడే అవకాశం ఉందని.. 1990 నుంచి వైఎస్ తో ఉన్నానని పేర్కొన్నారు. భగవంతుడు తల్లిదండ్రుల తర్వాత నాకు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ల పాలన నక్కకు నాగలోకానికి ఉన్నది తేడా ఉందని చురకలు అంటించారు.
పవన్, టిడిపి లకు 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని… ఒంటరిగా చంద్రబాబు కి 100 సీట్లు వస్తాయని వివరించారు.బాబాయ్ ని చంపితే దిక్కులేదు తల్లిని చెల్లిని పక్కన పెట్టారు.. తిరుపతిలో నేను చేసిన కామెంట్స్ వేరు వాటిపై దుష్ప్రచారం జరిగిందన్నారు. రెండు రాష్ట్రాల్లో దోపిడీ పెరిగిపోయింది.. వాల్మీకి ఎలా రుషిగా మారారో అలా మారాలని కోరారని తెలిపారు. బాలినేనికి జూదమాడి అప్పులు మిగిలాయని.. ముఖ్యమంత్రిని కలిసి అబద్ధపు అప్పుల లిస్టు బాలినేని ఇచ్చాడన్నారు గోనె ప్రకాష్.