ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్…పరీక్ష ఫీజు చెల్లింపు గడుపు పొడిగింపు !

-

ఏపీ టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్. పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడుపును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 30 వరకు, రూ. 50 లేట్ ఫీజుతో డిసెంబర్ 1 నుంచి 4 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 5 నుంచి 9 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వం తెలిపింది.

Good news for AP Tenth students

ఇది ఇలా ఉండగా…జర్నలిస్టుల హౌస్ సైట్ కోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం అయింది. ఆంధ ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల హౌస్ సైట్ ఇచ్చేందుకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.మొన్న జరిగిన కేబినేట్‌ సమావేశంలో ఆంధ ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు 3 సెంట్ల హౌస్ సైట్ ఇచ్చేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్నయం తీసుకున్నారు. అయితే.. తాజాగా ఈ జర్నలిస్టుల హౌస్ సైట్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్ లైన్ విధానం ప్రారంభం అయింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version