Mohammed Shami: షమీ తల్లికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

-

వన్డే వరల్డ్ కప్ మరోసారి టీమిండియా చేజారింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియానే ట్రోఫీ ముద్దాడుతుందని అంత అనుకున్నారు. కానీ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ లో భారత్ తడబడింది. బ్యాటింగ్ విభాగం తడబాటుతో బౌలర్లపై ఒత్తిడి పెరిగింది. చివరకు కంగారుల చేతిలో ఓడి వరల్డ్ కప్ చేజార్చుకుంది.

Mohammed Shami’s mother Anum Ara hospitalised while watching IND vs AUS CWC 2023 final

ఇది ఇలా ఉండగా….టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ తల్లి అనుమ ఆరా అస్వస్థకు గురయ్యారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తాజాగా వెలుగు చూసింది. వెంటనే ప్రాథమిక చికిత్స అందించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మ్యాచ్ చూస్తున్న సమయంలో ఆందోళనకు గురయ్యారని…. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని షమీ బంధువులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version