ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు… శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. బూత్ లెవెల్ ఆఫీసర్లకు త్వరలోనే గౌరవ జీతాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 4,638 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారు. వారందరికీ గత కొన్ని రోజులుగా గౌరవ వేతనం అందడం లేదు. అయితే ఈ ఉద్యోగులందరికీ త్వరలోనే గౌరవ వేతనం నుంచి ఎక్కువ రంగం సిద్ధం చేసింది.
2021 – 2002 నుంచి జీతాలు అందక 26 జిల్లాలలోని భూత లెవెల్ అధికారులు ఇబ్బంది పడుతున్నట్లు… తాజాగా ఒక ఫిర్యాదు తెరపైకి వచ్చింది. లోకయుక్త వరకు ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సంబంధించిన సమస్య వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ అంశంపై విచారణ జరిపి… బూత్ లెవెల్ ఆఫీసర్లకు జీతాలు ఇవ్వాలని ఆదేశించింది లోకయుక్త. ఈ తరుణంలోనే… దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 52.40 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు.. జీతాలు త్వరలోనే అందనున్నాయి.