ఆంధ్ర ప్రదేశ్ సీఎం, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఆంధ్ర ప్రదేశ్ సీఎం, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ నెల 8వ తేదీన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ ఉంది. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులపై చర్చ ఉండనుంది. కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పదవుల పంపకాలపై చర్చించే అవకాశం కూడా ఉంటుంది.
అలాగే… వారంలోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకుంది టీడీపీ పార్టీ. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఖరారు చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి.. పార్టీకి సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ ఉండనుంది. టీడీపీకి అందుతున్న ఫిర్యాదుల పరిష్కారంపై ఓ మెకానిజం రూపొందించే అంశం పైనా పొలిట్ బ్యూరోలో చర్చ ఉంటుంది. గడచిన ఎన్నికల్లో పార్టీకి ఓట్లేసిన వర్గాలకు ఏయేం ప్రయోజనాలు చేకూర్చాలనే దానిపై పొలిట్ బ్యూరోలో కసరత్తు చేస్తున్నారు పార్టీ పెద్దలు.