ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..కారుణ్య నియామకాలకు ఆదేశాలు జారీ

-

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. తాజాగా కారుణ్య నియామకాలకు ఆదేశాలు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనమయ్యాక మరణించిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు చేపట్టేలా యాజమాన్యం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

346 డ్రైవర్లు, 90 కండక్టర్లు, 229 అసిస్టెంట్ మెకానిక్స్, 50 ఆర్టిసి కానిస్టేబుల్స్ కలిపి మొత్తం 715 పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని పేర్కొంది. దీనికి సంబంధించిన జోన్ల ఈడీలు, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి.

ఇక అటు ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఎపీపీఎస్సీ) శుభవార్త చెప్పంది. ఏపీ కాలుష్యనియంత్రణ మండలిలో 29 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఏపీ పీసీబీలో సహాయ పర్యావరణ ఇంజనీర్లు పోస్టులు 21, గ్రేడ్ 2 అనలిస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఆర్ధికశాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి.

Read more RELATED
Recommended to you

Latest news