ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. కరెంట్‌ ఛార్జీలు పెరగవ్

-

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌..ఏపీలో ఇక కరెంట్‌ ఛార్జీలు పెరగవ్. విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిస్కమ్ లు(SPDCL, CPDCL, EPDCL) తీసుకున్నాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు, పరిశ్రమలకు ఈ ఏడాది పాత టారిఫ్ లే కొనసాగించనున్నట్లు వెల్లడించాయి.

Good news for the people of AP Current charges will not increase

రైల్వేకు అందిస్తున్న విద్యుత్ చార్జీలపై యూనిట్ కు రూ. 1, గ్రీన్ పవర్ కేటగిరీలో 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ఈఆర్సిని కోరాయి. వీటికి త్వరలో ఆమోదం లభించనుంది. దీంతో ఏపీలో ఇక కరెంట్‌ ఛార్జీలు పెరగవన్న మాట. ఇక ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో.. ఏపీ ప్రజలకు భారీ ఊరట లభించనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version