ఎలిమినేటి మాధవరెడ్డి కొడుక్కి అవమానం?

-

ఎలిమినేటి మాధవరెడ్డి కొడుకు, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి అవమానం జరిగింది. ప్రజాపాలన సభలో సందీప్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీసులతో గెంటెయించారు. గూడూరులో పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో మంత్రి సందీప్ పాల్గొన్నారు.

Shame on Bhuvanagiri ZP Chairman Sandeep Reddy

ఈ క్రమంలో సందీప్ ను వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేవు అంటూ కించపరుస్తూ మంత్రి మాట్లాడారు. దీనిని ప్రశ్నించిన అతడిని పోలీసులతో అక్కడి నుంచి బలవంతంగా బయటకు పంపారు. ఇక అటు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పై నోరు పారేసుకున్న కోమటిరెడ్డి తీరును ఖండించారు కేటీఆర్. జడ్పీ చైర్మన్ కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.. జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్..మీ వెనుక మేం ఉన్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version