తిరుమల శ్రీ వారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆలయంలో నేటి నుంచి అర్జిత సేవలను తిరిగి ప్రారంభించింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత తిరిగి అర్జిత సేవలను టీటీడీ పునఃప్రారంభించింది. కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నెలలో అర్జిత సేవలను టీటీడీ నిలిపివేసింది. తాజా గా ఈ రోజు నుంచి అర్జిత సేవలను టీటీడీ పునః ప్రారంభించింది. నేటి నుంచి ప్రారంభం అయ్యే అర్జిత సేవలకు అనుగూణంగా ఇప్పటికే టికెట్లను టీటీడీ అన్ లైన్ లో అందుబాటు లో ఉంచింది.
అలాగే సుప్రభాతం, తోమాల, అర్చన, అభిషేకం వంటి అర్జిత సేవలకు టికెట్లను లక్కి డిప్ ద్వారా కేటాయించారు. కాగ వృద్ధులు, విలాంగుల దర్శనం కేసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోకన్ల ఆన్ లైన్ విడుదలను నేటి నుంచి 8 వ తేదీకి వాయిదా వేశారు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ టికెట్ల విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 8 వ తేదీన ఉదయం 11 గంటలకు వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నారు. వీరి కోసం ప్రతి రోజు దాదాపు 1000 టికెట్ల ను అందుబాటులో ఉంచాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.