YSR పింఛన్ల పంపిణీపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈనెల 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతుండగా… తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నెలలో రెండు లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇస్తున్న నేపథ్యంలో… వాటిని కూడా వాలంటీర్లు ఈనెల 10లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఏపీలోని కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఈ నెల 8వ తేదీ వరకు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పోస్టుల నియామకానికి గడువు పొడిగించింది ఏపీ సర్కార్.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో పలు పోస్ట్ లు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతి పై ఒక సంవత్సరం కాల పరిమితి నియమించుటకు ధరఖాస్తులు స్వీకరణ తీసుకుంటామని వెల్లడించారు. అర్హత గల అభ్యర్ధులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ధరఖాస్తులను స్వీకరణ చేస్తామని పేర్కొంది ఏపీ సర్కార్.