ఏపీ విద్యుత్‌ ఉద్యోగులకు శుభవార్త.. ఇకపై 9 శాతం ఫిట్ మెంట్

-

ఏపీ సర్కార్‌ తో విద్యుత్‌ ఉద్యోగులు చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. పీఆర్సీపై ఎట్టకేలకు అంగీకారం తెలిపింది ఏపీ సర్కార్‌. ఒప్పందంపై యాజమాన్యం, ఉద్యోగ సంఘాల సంతకాలు కూడా చేశారు. దీంతో సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది ఏపీఎస్‌పీఈ జేఏసీ.

అనామలీస్‌ ఉంటే సరిచేసి పేస్కేలు ఫిక్స్‌ చేయడానికి ఏపీజెన్‌కో ఎండీ నేతత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం జరిగింది. 9 శాతం ఫిట్ మెంట్ కు ఉభయుల అంగీకారం అయింది. మాస్టర్ స్కేల్ రూ. 2.60 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించింది సబ్ కమిటీ.

ఈ సందర్భంగా ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ…విద్యుత్ ఉద్యోగులతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి…సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని కోరామన్నారు. వివిధ అంశాలపై ఒప్పందం కుదిరింది. రేపు అగ్రిమెంట్ చేస్తామని..ఫిట్మెంట్ 8 శాతం ఇచ్చామని వివరించారు. ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నా వాటిని కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news