దేవాలయాల్లో అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్

-

విజయవాడ: ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆలయాల్లో ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేసిన ఉద్యోగులపై చర్యలకు సిద్దం అయ్యింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు దేవాదాయ శాఖ కమిషనర్. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆలయాల్లో ఉద్యోగుల డ్యూటీలు మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకే పోస్టులో ఏళ్ల తరబడి కొనసాగటం వల్లే అవకతవకలకు కారణమని ఆరోపణలు రావడంతో ఈ చర్యలు చేపట్టారు.

ఆలయాల్లో AEO, సూపరెండెంటెంట్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్స్, రికార్డింగ్ అసిస్టెంట్స్, ఆలయ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులకు డ్యూటీలు రొటేషన్ పద్దతిలో 3 నెలలకు ఒకసారి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో 11 ప్రధాన ఆలయాలతో పాటు కోటి పైన ఆదాయం వచ్చే ఆలయాల్లో ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version