జగన్ ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి..ఆ పని ద్వారా ప్రజలకు మిలుతో పాటు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ అయిన రాజకీయ ప్రయోజనాలే కోరుకుంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ కూడా అంతే. అదే సమయంలో ప్రజా ప్రయోజానాలు కూడా ముఖ్యంగా ఉంటాయి. ఇలా రెండిటినీ జగన్ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంటారు.
అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని, జగన్‌ని ఇంటికి పంపిస్తామని టిడిపి, జనసేన నేతలు అంటున్నారు. ఇక జగన్ ని ఓడించడానికి చంద్రబాబు, పవన్ ఏకం అవుతున్నారు. పైగా ఈ రెండు పార్టీలు కలిస్తే..వైసీపీకి ఇబ్బందే అని విశ్లేషణలు వస్తున్నాయి. కానీ ఇదంతా మాటల్లోనే చేతల్లో వేరే ఉంది. వైసీపీకి ఎక్కడ కూడా ఓటు బ్యాంక్ తగ్గడం లేదు. గత ఎన్నికల్లో 50 శాతం వరకు పడింది. ఇపుడు ఓ 5 శాతం తగ్గిన సరే పోయేదేమీ లేదు..వైసీపీనే లీడ్ లో ఉంటుంది.
ఇక వైసీపీకి ప్రత్యేకంగా కొన్ని ఓట్లు ఉండిపోయాయి..అవే ఇప్పుడు జగన్ ని మళ్ళీ అధికారంలోకి తీసుకురానున్నాయి. మొదట సంక్షేమ పథకాల లబ్దిదారులు..వీరే మెయిన్..అయితే పథకాలు అందిన ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారా? అంటే వేయరనే చెప్పాలి. అందులో టిడిపి, జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ జగన్ పథకాలు నచ్చి వైసీపీ వైపుకు వచ్చిన వారు ఉన్నారు. లబ్దిదారులు 60 శాతం ఓట్లు వేసిన చాలు. ఇక వాలంటీర్, సచివాలయ ఉద్యోగులు దాదాపు 4 లక్షల వరకు ఉన్నారు..ఇంకా వీరి కుటుంబాలని లెక్క వేసుకుంటే భారీగా ఉంటాయి.
అయితే వాలంటీర్లు దాదాపు వైసీపీ వాళ్ళే. కానీ సచివాలయ ఉద్యోగులు గత ఎన్నికల్లో టిడిపికి, జనసేనకు ఓట్లు వేసినవారు ఉన్నారు. కానీ ఇప్పుడు జగన్ ఉద్యోగాలు ఇవ్వడంతో వారు, వారు కుటుంబాలు వైసీపీ వైపు నిలుస్తున్నారు. ఇక వైసీపీకి ప్రధాన బలమైన కార్యకర్తలు ఎలాగో ఉన్నారు. ఇవన్నీ లెక్క వేసుకుంటే మళ్ళీ వైసీపీదే గెలుపు.