ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించింది. కూటమి విజయం సాధించడంతో ఏపీ లో ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా రానట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష దక్కాలంటే వైసీపీకి 23 సీట్లు రావాలి. కానీ 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం.
దీంతో తాజాగా సీఎం జగన్ స్పందిస్తూ.. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం భయపడుతోందన్నారు. తమకు ప్రతిపక్ష హోదా వస్తే.. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తామని.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడతారని భయపడుతున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు శాసనమండలి లో ప్రతిపక్ష నేతగా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని నియమించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా జనసేన కు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. జనసేన కూటమిలో భాగమైనప్పటికీ.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం.