కేర‌ళ‌లో నిఫా.. మృతి చెందిన బాలుడి కాంటాక్ట్ లిస్టులో 350 మంది

-

కేర‌ళ‌లో నిఫా వైర‌స్  కి 14 ఏళ్ల పిల్లోడు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే ఆ కుర్రాడితో కాంటాక్టులోకి వ‌చ్చి రిస్క్‌లో ఉన్న‌ వారి జాబితాను త‌యారు చేస్తున్నారు. ఆ లిస్టులో 350 మంది ఉన్న‌ట్లు ఆరోగ్య‌శాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. దాంట్లో 101 మంది హై రిస్క్ కేట‌గిరీలో ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. 13 మంది టెస్ట్ రిజ‌ల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న‌ట్లు కేర‌ళ ఆరోగ్య శాఖ తెలిపింది. కోజికోడ్‌లోని వైరాల‌జీ ల్యాబ్‌కు వాళ్ల శాంపిళ్ల‌ను పంపారు. ల్యాబ్‌కు శ్యాంపిళ్లు పంపిన‌వారిలో.. ఆరుగురికి నిఫా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు. మృతిచెందిన పిల్లోడి పేరెంట్స్ మాత్రం ఎటువంటి ల‌క్ష‌ణాలులేవు. అయినా వాళ్ల శ్యాంపిళ్ల‌ను మ‌రోసారి టెస్టింగ్‌కు పంపిన‌ట్లు మంత్రి చెప్పారు.

పాల‌క్కాడ్‌, తిరున‌వంత‌పురం నుంచి కాంటాక్టులో వ‌చ్చిన‌వారు ప్ర‌స్తుతం చికిత్స తీసుకుంటున్నారు. మ‌ర‌ణించిన పిల్ల‌వాడు పాండిక్క‌డ పంచాయ‌తీలో ఉన్న ఓ ప్రాపర్టీ నుంచి ఫ‌లాన్ని తిన్న‌ట్లు అత‌ని మిత్రులు తెలిపారు.ఆ ప్రాంతంలో గ‌బ్బిలాలు ఉన్న‌ట్లు గుర్తించారు. మ‌ల‌ప్పురంకు చెందిన 14 ఏళ్ల పిల్లోడు .. నిఫా ఇన్‌ఫెక్ష‌న్‌తో ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. కుర్రాడి మిత్రుల‌కు ఆన్‌లైన్‌లో క్లాసులు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version