విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాామని TDP హెచ్చరించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణను అడ్డుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కు తానే పాలాభిషేకం చేస్తానని ఆయన అన్నారు. ఈనెల 29న విశాఖలో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించింది.
ప్రభుత్వ రంగంలో కొనసాగించడం లేదా సెయిల్ లో విలీనం చెయ్యడమో ప్రకటన చేయాలనీ రౌండ్ టేబుల్ మీటింగ్ తీర్మానం చేసింది. రాజకీయ ఒత్తిడి పెంచే దిశగా పోరాట కమిటీ తదుపరి కార్యా చరణ ప్రకటించింది. రేపు వెయ్యి మంది నిర్వాసిత గ్రామాల ప్రజలతో నిరసన ప్రదర్శన తలపెట్టింది. ఈ నెల 28న ఉదయం నుంచి కూర్మన్న పాలెం శిబిరం దగ్గర కార్మికులు, కుటుంబాలతో కలిసి 36గంటల దీక్షలు నిర్వహిస్తామని పోరాట కమిటీ వెల్లడించింది.