వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను మాత్రమే పోలీసులు టార్గెట్ చేస్తున్నారు : అంబటి

-

వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ITDP అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం లో ఈ నెల 17,18,19 తేదీలలో అనేక పోలీసు స్టేషన్ లలో ఫిర్యాదులు చేశాం. ఆ ఫిర్యాదులు పై ఇప్పటి వరకు కేసులు కూడా కట్టినట్లు సమాచారం లేదు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికీ 100 మంది పై కేసులు పెట్టారు. వైసీపీ నేతలపై టీడీపీ నాయకుల ట్విట్టర్ లో సైతం దుర్భాషలాడుతున్నారు.

ఈ విషయంపై మేము 10 ఫిర్యాదులు చేస్తే ఒక్క కేసు నమోదు కాలేదు. కానీ వైసిపి క్యాడర్ పై 300 కేసులు నమోదు చేశారు. టీడీపీ నాయకుల చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాగే పోలీసులు ప్రవర్తిస్తే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రులు ఫిర్యాదునే పట్టించుకోక పొతే ఎలా. ఇదే విషయం పై పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం. మేం ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయడం లేదు. ఐదు స్టేషన్ లలో మేము ఇచ్చిన పది ఫిర్యాదులలో కేసులు నమోదు చేయాలి. లేదంటే ఉన్నత న్యాయ స్థానాలలో ప్రైవేటు కేసులు వేస్తాం అని మాజీ మంత్రి అంబటి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version