చీరలు, చుడీదార్లను లోకువ చేసి మాట్లాడుతున్నారు – జీవీఎల్‌ ట్వీట్‌

-

అమరావతి : చీరలు, చుడిదార్ల రాజకీయంలోకి బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు వచ్చారు. చీరల కామెంట్ల విషయంలో రోజా, అనితల కామెంట్లను తప్పు పడుతూ జీవీఎల్‌ ట్వీట్‌ చేశారు. మంత్రి రోజా, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితలు మహిళ నాయకురాళ్లుగా ఉంటూ చీరలు, చుడీదార్లను లోకువ చేసి మాట్లాడుతున్నారని.. ఇది మహిళలను కించపరచడమేనని ఫైర్‌ అయ్యారు జీవిఎల్‌.

మహిళలను మహిళలే అగౌరవపర్చడం రోజా, అనితలకు తప్పనిపించడం లేదా..? అని చురకలు అంటించారు. మహిళలకు ఇచ్చే గౌరమిదేనా..? ఆత్మ పరిశీలన చేసుకోండన్నారు. అయితే.. జీవిఎల్‌ ట్వీట్‌ కు వంగలపూడి అనిత కౌంటర్‌ ట్వీట్‌ చేశారు.

ఆ ప్రస్తావన తెచ్చింది మొదట వాసిరెడ్డి పద్మ.. అప్పుడు జీవీఎల్‌ ఏమయ్యారు..? వైసీపీ మీద ఈగ వాలితే చాలు జీవీఎల్‌ వచ్చేస్తారని ఎద్దేవా చేశారు. చీరల విలువ గురించి జీవీఎల్‌తో చెప్పించుకునే స్థితిలో లేమని.. ఇదే సూక్తిముక్తావళి అమరావతి మహిళల చీరల గురించి మాట్లాడిన బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి చెప్పారా అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version