బిగ్‌ అలర్ట్.. ఏపీలో ఈ 198 మండలాల్లో వడగాలులు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై భానుది ప్రతాపం కొనసాగుతోంది. నిన్ను పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైయస్సార్ కడప జిల్లా చాపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Hailstorm in these 198 mandals in AP

ఈ రోజు 47 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంతవరకు నీడపట్టునే ఉండాలని సూచించింది. ఇక అటు తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి.

నిన్న ఆరు జిల్లాలో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగుల పల్లిలో 45.4° ఉష్ణోగ్రత నమోదయింది. మంచిర్యాల, మెదక్ జిల్లాల్లో వడదెబ్బతో ఇద్దరు మరణించారు. మరోవైపు ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version