చిరంజీవికి యూకే పార్లమెంట్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది : పవన్ కళ్యాణ్

-

అన్నయ్య చిరంజీవికి యూకే పార్లమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలిపారు.  “నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.  జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్నప్పుడు మార్గం చూపించిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అన్నారు.  సాధారణ మధ్య తరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, అభిమానులను అలరించిన వ్యక్తి చిరంజీవి” అని కొనియాడారు.

మెగాస్టార్ చిరంజీవిని యూకే కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా ఘనంగా సత్కరించారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు అభిమానులు చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఫొటోలు షేర్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news