బర్డ్ ఫ్లూ ఎఫెక్టు 24 గంటల్లో 10 వేల కోళ్లు మృతి. చెందాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుమోలులంకలోని శ్రీ బాలాజీ ఫౌల్ట్రీ ఫామ్ లో భారీగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా డిస్పోజ్ చేయాలని సూచించారు వెటర్నరీ అధికారులు. అధికారుల సూచన మేరకు చనిపోయిన కోళ్లను భూమిలో పూడ్చి పెట్టారు ఫౌల్ట్రీ యజమాని.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/New-Project-12.webp)
బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు, చికెన్ షాపులు, కోళ్లు, గుడ్ల ను పుడ్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక అటు బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందడం తో అప్రమత్తమైన తెలంగాణ సర్కార్…. తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టులు చేశారు. ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను వెనక్కి పంపుతున్నారు అధికారులు.