తెలంగాణ, ఏపీలకు మరో తుపాను ముప్పు వచ్చి పడింది. దీంతో తెలంగాణ, ఏపీలకు 3 రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. ఈ నెల 14 నుంచి 16 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ప్రకటన చేసింది.
మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండు, మూడు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నట్లు వెల్లడించింది భారత వాతావరణ శాఖ. ఇక అటు ముంబైలో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో భయానకంగా ఆర్థిక రాజధాని మారింది. మహారాష్ట్రలోని ముంబైలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రభాదేవి ప్రాంతంలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్ మరియు NM జోషి మార్గ్‌లు వరదలకు గురైన వీధుల గుండా ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలను చూపుతున్న దృశ్యాలు ఉన్నాయి.