BREAKING : ఏపీ, తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్షాలు

-

BREAKING : ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బగ్‌ అలర్ట్. ఏపీ, తెలంగాణకు రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. త్వరలో నైరుతి రుతుపవనాలు తిరోగమనం కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాలను అక్టోబర్ 6-12 మధ్య వీడే అవకాశం ఉందని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం చురుకుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి.

Heavy rains for two days in AP and Telangana

దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలెర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. అలాగే… మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌తో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అటు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ.. ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version