సగం వీడియోనే బయటకు వచ్చింది.. నా ఉద్దేశం అది కాదు : జాహ్నవి కేసులో పోలీస్​ క్లారిటీ

-

అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతి చెందడం.. ఆమె మరణంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాను భారత్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసు అధికారి డేనియల్‌ ఆర్డరర్‌కు సియాటెల్‌ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది. వివాదంపై సియాటెల్‌ పోలీసు అధికారుల గిల్డ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఏం ఉందంటే..?

‘వైరల్‌ అయిన దృశ్యాలు బాడీక్యామ్‌ వీడియో రికార్డ్‌ చేసినవి. ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బహిర్గతం అయ్యింది.’ అని పోలీసు అధికారుల గిల్డ్‌ వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్‌ రాసిన లేఖను కూడా గిల్డ్‌ విడుదల చేసింది. ‘న్యాయవాదులను ఉద్దేశిస్తూనే.. నేను ఈ వ్యాఖ్యలు చేశాను. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి.. ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను. బాడీక్యామ్‌ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం నాకు తెలీదు. బాధితురాలిని అవమానించేలా నేను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’ అని డేనియల్‌ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version