మాజీ మంత్రి విడుదల రజనీపై రెండు వారాలలోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపించాలని పేర్కొంది హైకోర్టు. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనని చిత్రహింసలకు గురి చేశారు అంటూ చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. టిడిపి కార్యకర్తలను విడదల రజిని వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులకు గురిచేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనని చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్ లో చూస్తూ విడుదల రజిని పైశాచిక ఆనందం పొందినట్లు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని నాడు బెదిరింపులకు దిగారని, రామకృష్ణ, ఫణీంద్ర, అప్పటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణ, రజిని పీఏ ల పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు పల్నాడు ఎస్పి శ్రీనివాసరావును గతంలో కోరారు.
కానీ రజినీపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అతడు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపాడు. తాజాగా పిల్లి కోటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. రెండు వారాలలోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.