దారుణంగా నంద్యాలలో కొట్టుకున్న హిజ్రాలు !

-

నంద్యాలలో కొట్టుకున్నారు హిజ్రాలు. బిక్షాటన విషయంలో హిజ్రాల వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నంద్యాలలో బిక్షాటన విషయంలో రూరల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల ముందే కారంపొడి చల్లుకొని, రాళ్లతో దాడులకు పాల్పడి వీరంగం సృష్టించారు హిజ్రాలు. బిక్షాటన విషయంలో పాణ్యం, నంద్యాలకు చెందిన హిజ్రాల వర్గాల మధ్య కొంతకాలంగా నడుస్తోంది వివాదం.

Hijras brutally beaten in Nandyal

నంద్యాలలో బిక్షాటన చేయడానికి పాణ్యం వర్గం ప్రయత్నిస్తుండగా, అడ్డుకుంటోంది నంద్యాల వర్గం. ఈ క్రమంలో రూరల్ పిఎస్ ముందు ఎదురుపడ్డ రెండు వర్గాలు, దీంతో ఇరువర్గీయులు ఒకరిపై ఒకరు కారంపొడి చల్లుకొని రాళ్లురువ్యుకొని బీభత్సం సృష్టించారు. దీంతో టూ టౌన్ రూరల్ పోలీసులు పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి వంద హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version