హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠంగా కొనసాగుతోంది. తాజాగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. టిడిపి మున్సిపల్ ఛ్తెర్మన్ అభ్యర్థిగా డీఈ రమేష్ ను నియామకం చేసింది టీడీపీ పార్టీ. వైసీపీ మున్సిపల్ ఛ్తెర్మన్ అభ్యర్థిగా వెంకటలక్ష్మీ మహేష్ గౌడ్ పేరు ఖరారు చేశారు.

అటు విప్ ధిక్కరిస్తే వేటు తప్పందంటున్న వ్తెసిపీ… ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. చేతులు ఎత్తి ఛ్తెర్మన్ అభ్యర్థిని ఎన్నుకోనున్నారు కౌన్సిలర్లు. కాగా నేడు మూడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు మున్సిపాలిటీలకు చైర్మన్‌లు, మూడు కార్పొరేషన్‌లకు, డిప్యూటీ మేయర్‌లతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో వైస్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేటర్లు ఓటింగ్‌లో పాల్గొంటారు. తిరుపతి, నెల్లూరు కార్పొరేషన్లలో ఒక్కో డిప్యూటీ మేయర్, ఏలూరు కార్పొరేషన్‌లో 2 డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.