వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఆయన భార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పైన న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన భార్య పంకజశ్రీ ఆరోపించారు. వంశీని పోలీసులు అరెస్టు చేయడం.. కోర్టు రిమాండ్ విధించడంపై ఆమె స్పందించారు.

తన న్యాయ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ చెప్పలేదు. వంశీకి ఆరోగ్యం బాగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టుకి కచ్చితంగా వెళ్తామని పంకజ శ్రీ తెలిపారు.
కాగా హైదరాబాదులో నిన్న అరెస్ట్ అయిన వల్లభనేని వంశీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వల్లభనేని వంశీకి దాదాపు 14 రోజులపాటు రిమాండ్ విధించింది కోర్టు. సూర్యా రావు పేట పోలీస్ స్టేషన్ నుంచి వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలుకు తాజాగా తరలించారు ఏపీ పోలీసులు. వల్లభనేని వంశీ తో పాటు లక్ష్మీపతి కృష్ణ ప్రసాద్ ను కూడా విజయవాడ జైలుకు తరలించడం జరిగింది.