ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సరే కొన్ని ప్రాంతాలలో సౌకర్యాలు మాత్రం పెరగలేదు. ముఖ్యంగా బ్యాంకింగ్ సౌకర్యాలు సరైన విధంగా ఉండడం వలన ప్రతి ఒక్కరికి ఎన్నో సేవలను అందించవచ్చు. ఈ ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అదే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆర్థిక సేవలను అందిస్తున్నారు. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు, మహిళలకు బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా ఉచితంగానే డెబిట్ కార్డును కూడా అందిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి 50 కోట్ల మందికి పైగా ఈ జన్ ధన్ ఖాతాను తెరిచారు.

అర్హత మరియు అప్లై చేసే విధానం:

ఈ పథకానికి పదేళ్ల వయసు నిండిన వారు అర్హులు మరియు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఈ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందలేరు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్, మొబైల్ నెంబర్, అడ్రస్, వార్షిక ఆదాయం వంటి మొదలైన వివరాలను జన్ ధన్ ఫారం లో నింపాలి. అయితే ఈ ఫారం అధికారిక వెబ్సైట్ నుండి లేక బ్యాంకు ను సంప్రదించడం ద్వారా పొందవచ్చు. ఈ ఫారం తో పాటుగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వంటి ఇతర డాక్యుమెంట్లు కూడా ఇవ్వాలి. కాకపోతే ఈ ఖాతా తెరవడానికి ఎటువంటి ఫీజు ఉండదు.

పథకం ద్వారా పొందే ప్రయోజనాలు:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు డిపాజిట్ పై వడ్డీను పొందవచ్చు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు వరకు వస్తుంది. ఈ ఖాతాను మెయింటైన్ చేయడానికి మినిమం బాలన్స్ అవసరం లేదు. ఈ పథకం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ 30,000 వరకు ఉంటుంది. జన్ ధన్ ఖాతాను తెరిచి ఆర్థిక సేవలను పొందడం ఎంతో సులభం మరియు ఎటువంటి కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా వచ్చే డబ్బులు అయినా ఈ ఖాతాకు ట్రాన్స్ఫర్ అవుతాయి. జన్ ధన్ ఖాతాను తెరిచిన 6 నెలలకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా లభిస్తుంది. అయితే 5,000 వరకు ఈ సదుపాయం ఉంటుంది మరియు కేవలం ఒక ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ సదుపాయం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news