ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కు బిగ్ షాక్ తగిలింది. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ బ్యాగ్ మిస్సింగ్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ జీవీ రమణ బ్యాగ్ మిస్ కావడం సంచలనంగా మారింది. ఆ బ్యాగులో 30 రౌండ్స్ కలిగిన గన్ మ్యాగ్జైన్ తో పాటు.. విలువైన పత్రాలు ఉన్నాయని రమణ వెల్లడించాడు.

అయితే విజయనగరంలోని వన్ టౌన్ పరిధిలోని కలెక్టరేట్ దగ్గర తన బ్యాగ్ మిస్సైనట్లు రమణ తెలిపాడు. అయితే రమణ మద్యం మత్తులో తన ఆటో ఎక్కినట్లు ఆటో డ్రైవర్ చెప్పడంతో బ్యాగు రమణే ఎక్కడో మర్చిపోయినట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గన్‌మెన్ జీవీ రమణ బ్యాగ్ మిస్ కావడం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.