ఏపీ నిరుద్యోగులకు శుభవార్త అందజేసింది కూటమి ప్రభుత్వం. పోలీసు శాఖలలో సిబ్బందికి కొరత ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

6,100 కానిస్టేబుళ్ల పోస్టుల ఫలితాలు రిలీజ్ చేసిన హోం మంత్రి అనిత ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ అందిస్తామని స్పష్టం చేశారు. ఎంపికైన వారికి తొమ్మిది నెలలలో పోస్టింగ్ ఇస్తామని అన్నారు. కాగా, ఈ ఫలితాలలో గండి నానాజీ (విశాఖపట్నం), రమ్య మాధురి (విజయనగరం), అచ్యుతరావు (రాజమండ్రి) మొదటి మూడు స్థానాలలో నిలిచారు.