జగన్… తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా ప్రభుత్వం అండగా ఉంటుంది: వంగలపూడి అనిత

-

జగన్ మోహన్ రెడ్డి… తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… మహిళల భద్రతకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

home minister anitha

గంజాయి నివారణకు జగన్ హయాంలో ఒక్కసారైనా చర్యలు తీసుకున్నారా? అని శాసనమండలిలో హోంమంత్రి అనిత నిలదీశారు. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనితపై అనుచిత పోస్టులు పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హోం మంత్రి అనితపై అనుచిత పోస్టులు పెట్టిన తరుణంలో సత్యసాయి జిల్లా నాగిరెడ్డి పల్లెకు చెందిన బాలాజీరెడ్డి అరెస్టు అయ్యాడు. నిందితుడ్ని అరెస్టు చేసి తీసుకువచ్చిన దేవరాపల్లి పోలీసులు….విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version