తిరుపతి – సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ 5 గంటలు ఆలస్యం

-

Tirupati – Secunderabad special train delayed by 5 hours: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్‌ షాక్‌. తిరుపతి – సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ 5 గంటలు ఆలస్యం కానుంది. తిరుపతి, సికింద్రాబాద్ స్పెషల్ (07481) ట్రైన్ 5 గంటలు ఆలస్యంగా బయలు దేరనుంది. ముందస్తు సమాచారం లేకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి…. తిరుపతి – సికింద్రాబాద్ స్పెష ల్ ట్రైన్ 5 గంటలు ఆలస్యం కానుందని ప్రకటించారు.

Tirupati – Secunderabad special train delayed by 5 hours

దీంతో ఉదయం 8:30 గంటలకు సికింద్రాబాద్ కు చేరాల్సిన ట్రైన్ మధ్యాహ్నం 2 అవుతున్న రాలేదని ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో వృద్దులు, పిల్లలు, ఉద్యోగస్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, తిరుమల భక్తులకు అలర్ట్.. సర్వదర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. 03 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 08 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71, 441 మంది భక్తులు కాగా.. 23, 595 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.87 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version