విజయనగరం పైడితల్లి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు.. అమ్మవారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రా ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు. ప్రజలందరికీ పైడితల్లి అమ్మవారి ఆశీసులుండాలి. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాటులు చేశారు… అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. గత సంవత్సరం కన్నా, ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సిరిమానోత్సవం మూడు గంటలకే ప్రారంభం అవుతుంది.
భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నేను ప్రతీ సంవత్సరం పైడితల్లి అమ్మవారిని దర్శించికుంటాను. గత సంవత్సరం దర్శనానికి వస్తే లోనకి వెళ్లకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ప్రోటోకాల్ తో అమ్మను దర్శించికునే అవకాశం అమ్మవారే ఇచ్చింది. ఎన్డియే ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉండాలని, మరల రాక్షస ప్రభుత్వం రాకూడదని అమ్మవారిని కోరుకున్నాను. అనంతరం కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాట్లు పర్యవేక్షించారు వంగలపూడి అనిత.