ప్రతి ఒక్కరికి కూడా ఫీలింగ్స్ అనేవి కామన్ గా వస్తాయి. అంటే బయట జరిగే సంఘటనలకి భావోద్వేగ ప్రతిస్పందనలు సహజం. ఆనందం, ప్రేమ, కోపం, విచారం, నిరాశ ఇలా అన్ని ఫీలింగ్స్ సులభంగా వ్యక్తం చేయడం ఎలానో చూద్దాం. భావాలని వ్యక్తం చేసుకోవడానికి కచ్చితంగా వ్యక్తిని గుర్తించాలి. నమ్మిన వ్యక్తి దగ్గర మాట్లాడితే బావాలని సులువుగా పంచుకోవచ్చు. మనసులో ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పడానికి మిమ్మల్ని విశ్వసించే వారితో ఉండడం మంచిది. భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి శక్తివంతమైన మార్గం జర్నలింగ్.
మీరు ఏం ఫీల్ అవుతున్నారో ఇతరులకి చెప్పలేని సమయంలో జర్నలింగ్ చేయండి. దీని వలన ఫీలింగ్స్ ని సులువుగా బయట పెట్టొచ్చు. అలాగే భావాలని పదాల ద్వారా వ్యక్తపరచలేక పోతే పెయింటింగ్, డ్రాయింగ్ వంటి వాటి ద్వారా కూడా ఎక్స్ ప్రెస్ చేయొచ్చు. సంగీతం ప్లే చేయడం లేదా డాన్స్ చేయడం వలన కూడా ఫీలింగ్స్ ని బయట పెట్టొచ్చు. రన్నింగ్, వాకింగ్ వంటివి చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఎండోర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి.
మానసిక స్థితి మెరుగు పడుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. ఏడవడం వలన కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఏడుపు బలహీనతకి సంకేతం కాదు. ఏడవడం వలన నిరాశను తగ్గిస్తుంది. ఏడ్చిన తర్వాత ఎంతో ఉపశమనంగా ఉంటుంది. అలాగే కొన్నిసార్లు భావాలను వ్యక్తపరచడం సరిహద్దుల్ని ఏర్పరచుకోవాలి బౌండరీస్ పెట్టుకోవడంతో భవిష్యత్తులో ఇబ్బందులు రావు. ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేయడం కష్టంగా ఉంటే ఇతరులు సహాయం తీసుకోండి. కౌన్సిలర్ల సహాయంతో ఫీలింగ్స్ ని బయట పెట్టొచ్చు.