విశాఖ భారీ వర్షం పడుతోంది. ఈ తరుణంలోనే విశాఖలోని గోపాలపట్నంలో ప్రమాదకర స్థితిలో ఇండ్లు ఉన్నాయి. విశాఖలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండపై ఉన్న ఇళ్లకు పొంచి ప్రమాదం ఉంది. ప్రమాదపు అంచున కూలిపోయే స్థితిలో ఇళ్లు ఉన్నాయి. దీంతో అక్కడి స్థానికులు..బిక్కు బిక్కుమంటున్నాయి. ఇక అటు ఇవాళ మధ్యాహ్నం నుంచి ఉమ్మడి విశాఖలో భారీ వర్షం దంచికొడుతోంది. అటు విశాఖ నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది.
దీంతో వాహనాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అటు విశాఖ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు అధికారులు చెబుతున్నారు. పాత బిల్డింగ్ ల వద్ద ఉండొద్దని అధికారులు సూచనలు చేస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది.