Huge increase in cooking oil prices: దీపావళి పండుగకు ముందు… దేశ ప్రజలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మొన్ననే వంట నూనెల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వంట నూనెల ధరలు భారీగా పెరిగిపోయాయి. గత నెలలో…. పామాయిల్ పైన ధరలు పెరుగబోతున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే… వంద రూపాయలు ఉన్న పామాయిల్ ధర… 137 రూపాయలకు చేరింది.
అలాగే సోయాబీన్ ఆయిల్ ప్యాకెట్ 120 రూపాయలు ఉన్నది 148 రూపాయలు అయింది. సన్ ఫ్లవర్ 120 రూపాయల నుంచి 149 రూపాయలకు పెరిగిపోయింది. అలాగే ఆవనూనె 140 రూపాయల నుంచి 1081 పెరిగింది. పల్లీల నూనె 180 రూపాయల నుంచి 184 రూపాయలకు చేరుతుంది. అయితే దేశవ్యాప్తంగా నూనె గింజల సాగు పెద్దగా లేకపోవడంతో…అదే సమయంలో దిగుమతి సుంకాల పెంపుతో ధరలు పెరిగినట్లు…వ్యాపారవేత్తలు చెబుతున్నారు. కొత్త పంట వచ్చేవరకు ధరలు ఇలాగే ఉంటాయని అంటున్నారు.