ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్… భారీగా పెరిగిన తలసరి ఆదాయం !

-

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా తలసరి ఆదాయం పెరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం తయారీ రియల్ ఎస్టేట్ తదితర అన్ని రంగాలలో కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి మరియు జలసరి ఆదాయం భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 3,74,369 కోట్లు పెరిగింది.

Huge increase in per capita income

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం గత నాలుగు సంవత్సరాలలో 65 వేల రూపాయలు పెరిగింది. ఆర్బిఐ విడుదల చేసిన గణాంకాలు ఈ వివరాలు వెల్లడించాయి. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల వారీగా గణాంకాలను ఆర్బిఐ ఈ నివేదికలలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయం తయారీ రంగం మరియు రియల్ ఎస్టేట్ తదితర రంగాల ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తికి విలువ జోడించినట్లు ఆర్.బి.ఐ పేర్కొంది. ఈ లెక్కన గత నాలుగు సంవత్సరాల లో తలసరి ఆదాయం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి భారీగా పెరిగినట్లు స్పష్టం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news