అనకాపల్లి జిల్లాలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం లీక్… 9 మందికి అస్వస్థత, ఒక కార్మికుడు మృతి..!

-

అనకాపల్లి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లము లీక్ అయింది. దీంతో 9 మందికి అస్వస్థత నెలకొనగా, ఒక కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఠాగూర్ లేబరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 పరిశ్రమలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము లీక్ అయింది.

Hydrochloric acid leak in Anakapalli district

ఈ ప్రమాదంలో 9 మందికి అస్వస్థతకు గురి కాగా, ఒక కార్మికుడు మృతి చెందాడు. అస్వస్థత గురైన కార్మికులను కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కు, వడ్లపూడి పవన్ సాయి హాస్పిటల్ కు తరలించింది కంపెనీ యాజమాన్యం. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news