ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్ ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడం పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్టు హోమంత్రి అనిత వెల్లడించారు.
ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ పై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ విధి విధాానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపిందన్నారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్య కుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.